-
విజయదశమి నుంచి విశాఖ పరిపాలన: సీఎం జగన్
-
ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఆమోదించిన కేబినెట్
-
ఆంధ్రప్రదేశ్ (తాడేపల్లి):
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది కేబినెట్. ఈ సందర్బంగా సీఎం జగన్ వచ్చే విజయదశమి నుంచి విశాఖ నుంచే పరిపాలన ప్రారంభిస్తామని తెలిపారు.
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్బంగా పలు కీలక బిల్లులకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్బంగా పరిపాలనా రాజధాని విశాఖ గురించి ప్రస్తావిస్తూ సమావేశంలో సీఎం కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచే విశాఖ నుంచి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. అప్పటి వరకు కార్యాలయాలను తరలించాలని నిర్ణయించారు. విశాఖలో కార్యాలయాల ఎంపికపై కమిటీని నియమించాలని ఆదేశించారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు సీఎం జగన్. అలాగే ముందస్తు ఎన్నికలు, జమిలి ఎన్నికలపై కేంద్ర నిర్ణయం ప్రకారం ముందుకు సాగుతామన్నారు.
[zombify_post]