స్వేరో అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చోటు సంపాదించిన కారణంగా స్వేరోస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో నర్సీపట్నం వేదిక పంక్షన్ హాలులో ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి స్వేరో నెట్వర్క్ రాష్ట్ర కన్వీనర్ ఎం.చిట్టియ్య స్వేరో అధ్యక్షత వహించారు.ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్వేరో నెట్వర్క్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల మాట్లాడుతూ 2012లో ఆవిర్భవించిన స్వేరో నెట్వర్క్ నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సందర్భంగా ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు.అమెరికాలో హార్వార్డ్ యూనివర్సిటీలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చదువుకునేటప్పుడు ఆయన మదిలో మెదిలిన ఈ స్వేరో అనే పదం నేడు ఏకంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఒక ఒక నామవాచకంగా పేరు సంపాదించడం ఎంతో గర్వంగా ఉందని, స్వేరోలందరూ మరింత కష్టపడి ఈ స్వేరో ఉద్యమాన్ని ప్రచారం చేయగలరని పిలుపునిచ్చారు. స్వేరో ముఖ్య లక్ష్యాలు అయిన అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, ఆత్మగౌరవం అనే లక్ష్యాలు ప్రజలందరిలో సాధికారత పొంది ఒక కొత్త సమాజాన్ని సృష్టించాలని పనిచేయడం స్వేరోధర్మమన్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన స్వేరో ఎంప్లాయిస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తహశీల్దార్ రాధా మాట్లాడుతూ స్వేరో అనే పదాన్ని మరికొద్ది సంవత్సరాల్లో వెర్బ్ గా డిక్షనరీలో చూడాలి అంటే మనం ఎంతో క్రమశిక్షణతో స్వేరో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన నర్సీపట్నం మండల విద్యాశాఖ అధికారి సిహెచ్ తలుపులు మాట్లాడుతూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఉన్న ఒక పదం ప్రపంచస్థాయి గుర్తింపు పొందడం ఎంతో చారిత్రాత్మకమని, ఈ సందర్భంగా స్వేరోలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో స్వేరో నెట్వర్క్ వైస్ చైర్మన్ పాకం జయరాం, కో కన్వీనర్ దుబ్బాక నాగమోహన్, ఎస్సిసి మెంబర్స్ శివరాజ్, కల్పన,పద్మజ, రమణ, అప్పా రమణ, ఓబులేసు,పాపారావు, నారాయణప్ప, తదితరులు పాల్గొన్నారు.అనంతరం కార్యక్రమాన్ని జయప్రదం చేసిన నర్సీపట్నం డివిజన్ స్వేరో నాయకులు బొట్టా నాగరాజు,గంగాధర్, నారాయణ, కోడి రాజబాబు, పడవల చక్రవర్తి, మురళి, వీరబాబు, కనకరాజు, మెల్లిపాక శివ,సిహెచ్ అప్పారావు,జల్లూరు ప్రసాద్ వంశీ,గాటీలు, సత్యనారాయణ,ఆనంద్ లు హాజరైన వారందరికీ జ్ఞాపికలు అందజేసి ధన్యవాదాలు తెలిపారు.
[zombify_post]