in ,

నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా

నర్సీపట్నం. కవి కోకిల, పద్మ విభూషణ్, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 128వ జయంతి కార్యక్రమం స్వేరో నెట్వర్క్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ముందుగా గుర్రం జాషువా  చిత్ర పటానికి పూలమాల వేసి అలంకరించారు. ఈ సందర్భంగా ఏపీ స్వేరో నెట్వర్క్ కన్వీనర్ ఎం.చిట్టియ్య   మాట్లాడుతూ తెలుగు సాహితీ లోకాన ధృవతార గుర్రం జాషువా అని,తెలుగు పద్యాన్ని సామాజిక చారిత్రక పౌరాణిక రంగాల్లో ఉరకలెత్తించిన గొప్పసాహితీ యోధుడు గుఱ్ఱం జాషువా,ఆ రోజుల్లో ఉన్నత వర్గాలు వారి హోదా కి చిహ్నంగా పావురాల ద్వారా చిలుకలు ద్వారా వర్తమానాలు పంపేవారు. జాషువా పక్షులలోవివక్షకు గురయ్యే గబ్బిలం ద్వారా  సామాన్యుని వేదన ని ఈశ్వరునికి చెప్పడం ద్వారా సమాజానికి గొప్ప సందేశాన్ని గబ్బిలం రచన ద్వారా ఇచ్చాడని, ఆయన రాసిన ఫిరదౌసి లో రాజు కంటే కవి గొప్పవాడు అని చాటిచెప్పాడన్నారు.ఈ కార్యక్రమంలో కాపారపు అప్పారావు,నాగరాజు,సాంబశివ ,చిరంజీవి, సత్యనారాయణ,ప్రసాద్, దేముడు,ఆనంద్,కొల్లి గంగాధర్,బొడారపు కన్నబాబు,మెలిపాక శివ,కృష్ణ పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by N.Chiranjeevi

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Trending Posts
Post Views

తొలగించిన ఆదివాసీల జాబ్ కార్డులను పునరుద్ధరించండి

స్టీల్‌ప్లాంట్‌ రక్షణకై అక్టోబర్‌ 5న విశాఖలో భారీ బహిరంగసభ