విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి వెళ్తాయంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీతో జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సరైన సమయంలో పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారన్నారు. బీజేపీ కూడా కలిసి వస్తే సంతోషమే అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే అని.. తమ కూటమి ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో జగన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని.. వచ్చే ఎన్నికలలో వైసీపీ సింగల్ డిజిట్‌కే పరిమితం అవుతారని అన్నారు. ఆ పార్టీకి అభ్యర్థులు కూడా కరువు అవుతారన్నారు. జంతువులు సింగల్‌గా వస్తాయని… మనుష్యులు కలిసి వస్తారని పవన్ చక్కగా చెప్పారని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
[zombify_post]