జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 ప్రదక్షణలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండలరావు పాల్గొన్నారు.
[zombify_post]