-
ధరలు తగ్గించకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగద్దె దింపడం ఖాయం….
–సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట:
ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల స్టంట్లు వేయకుండా పెరుగుతున్న ధరలు తగ్గించకపోతే ప్రజలే కెసిఆర్,మోడీ ల ప్రభుత్వాన్ని దింపడం ఖాయం అని సిపిఎం జిల్లా కార్యదర్శిమల్లు నాగార్జున రెడ్డి అన్నారు.
సోమవారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అధిక ధరలు- నిరుద్యోగంను వ్యతిరేకిస్తూ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో సిపిఎం కార్యాలయం నుండి శంకర విలాస్ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోరంత తగ్గించి ఎన్నికల సమయంలో ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం నడుస్తుంది అని ఆరోపించారు. దేశాన్ని తాకట్టు పెట్టే పనిలో మోడీ ప్రభుత్వం వుందని, దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను అమ్మి దేశభక్తి చెప్పడం దొంగే దొంగా అన్నట్లు వుంది అని ఆరోపించారు. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతి రోజూ మాటలతో కాలం నడిపిస్తూరని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తగ్గించవచ్చు అని , ఆ పని చేయకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ధరలు తగ్గించడం లేదు అని విమర్శించారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుల నడ్డి విరిసే విధంగా నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్యు, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. పెంచిన నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ పెరిగిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ నితమోడీ ప్రభుత్వం వచ్చి నతర్వాత దేశంలో అనేక మత కలహాలు కుల కొట్లాటలు ప్రాంతీయ విభేదాలతో ప్రజలను రెచ్చగొట్టి ఘర్షణలకు దారి తీసే విధంగా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. అధికారానికి రాకముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశంలో అవినీతి, అక్రమాలు అరికడుతూ అవినీతి రహిత పాలన అందిస్తానని వాగ్దానం చేసిన మోడీ దేశ సంపద మొత్తం ఆదాని,అంబానికి దోచిపెడుతూ ప్రజలపై అనేక భారాలు మోపుతున్నాడని ఆరోపించారు.
పసిపిల్లలు తాగే పాలు, పెరుగు చదువుకున్న విద్యార్థులపై పెన్ను, పుస్తకాలు, పెన్సి ల్, చాకు పీసులపై జిఎస్టి విధించి ధరల భారం మోపుతున్నాడని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలు తెగ నమ్మేస్తూ వెనకబడిన తరగతులకు షెడ్యూల్ కులాల, షెడ్యూలు తెగలకు రిజర్వేషన్ లేకుండా ఉపాధికి దూరం చేస్తున్నాడని విమర్శించారు.
పెట్రోల్,డీజిల్ గ్యాస్ ధరలు, మరియు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నాడని విమర్శించారు. కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా విభజించి కార్మికుల పట్టగొడుతున్నాడని, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు రుణాలు మాఫీ చేస్తూ రైతులకు మాత్రం రుణాలు మాఫీ చేయడం లేదని, ఇప్పటికైనా దేశ ప్రజలు బిజెపి పరిపాలనలో జరుగుతున్న దురాగతాలను అర్థం చేసుకొని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని భారతదేశాన్ని లౌకిక సెక్యులర్ దేశంగా కాపాడుకోవాలనిఅన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏక లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు దండ వెంకటరెడ్డి, మేకపోయిన సైదమ్మ, వీరబోయిన రవి, మేకరంబోయిన శేఖర్, వేల్పుల వెంకన్న, ఎల్గూరి గోవింద్, నాయకులు ఆవిరి అప్పయ్య, రణపంగా కృష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, నాయకులు వల్లపు దాసు సాయికుమార్, పందిరి సత్యనారాయణ రెడ్డి, యాతాకుల వెంకన్న, మడ్డి అంజిబాబు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]