- మందస మండలం లో పుష్కలమైన సాగునీటి వనరులు ఉన్నప్పటికీ, దశాబ్దాలుగా నిధులు మంజూరు కాకపోవడంతో అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు మారుతున్న సాగునీటి వనరుల అభివృద్ధి కొరకు చర్యలు తీసుకోకపోవడంతో రైతాంగం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా దామోదర సాగర్ కుడి కాలువ, బెల్లు పటియా ధోని మరమ్మతులకు నోచుకోక పోవడంతో రైతాంగం అవస్థలు పడాల్సి వస్తుంది. మరోవైపు నక్క సాయి రిజర్వాయర్ సర్వేలు కు మాత్రమే పరిమితం కావడంతో రైతాంగం ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. గోపాల సాగర్,సంకుజోడు, జంతి బంద, జన్నాచెరువు వంటి వాటిని మినీ రిజర్వాయర్ల గా అభివృద్ధి చేస్తే, పంట పొలాలకు సాగునీరు అంది సస్యశ్యామలం అవుతాయి. కానీ అభివృద్ధికి నోచుకోక పోవడంతో రైతులు ఇక్కట్ల కు గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో పిడి మందస ఎంపీటీసీ వాయిలపల్లి మాధవరావు మాట్లాడుతూ మందస మండల సాగునీటి వనరుల అభివృద్ధికై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కు లేఖ రాస్తున్నట్లు తెలియపరిచారు. ప్రభుత్వం సాగునీటి వనరులను అభివృద్ధి చేయకపోతే తన ఎంపీటీసీ పదవిని సైతం రాజీనామా చేస్తానని ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంసముగా మారింది. అధికార పార్టీ నాయకులే మందస మండల సాగునీటి వనరుల అభివృద్ధి పట్ల ఈ విధంగా మాట్లాడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దీనిపై నీటిపారుదల శాఖ ఏఈ శ్రీనివాసరావు సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే ప్రతిపాదనలు పంపడం జరిగిందని తెలియపరిచారు.ప్రజా ప్రతినిధులు రైతాంగ సమస్యలపై దృష్టి సారించి,నిధులు మంజూరు చేసి మందస మండలం లోని ఉన్నటువంటి సాగునీటి వనరులు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ప్రభుత్వం మందస మండల రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
[zombify_post]
