రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక తవ్వి దారి గుంతలు పడి దారుణంగా తయారైంది. వాహనదారులు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఖాదర్ సాబ్, చింతలగేని సూరి, పరసాని లక్ష్మన్న, నాగరాజు, సిద్ధప్ప, నరసింహులు, గోపాల్, నాగిరెడ్డి, నిమ్మయ వీరేష్ ఇంకా 40 మంది రైతులు సోమవారం ఉదయం కోసిగి మండల కేంద్రం సమీపంలో నాకేని చెరువు వంకలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ ను పట్టుకొని వారిపై గొడవకు దిగారు. రైతులు మాట్లాడుతూ ఈ దారిలో రోజు 300 ఎకరాలు సంబంధించిన 100 కుటుంబాలకు పైగా రైతులు ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండి, కాలినడకన వెళ్లే రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నోసార్లు చెప్పినా అధికారులు దీనిపై చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనం పై ఎరువులు అలాంటివి తీసుకు వచ్చేటప్పుడు, అలాగే ఈ దారిలో పొలం వెళ్లేటప్పుడు ఇద్దరూ మహిళలను వాహనంపై ఎక్కించుకొని ప్రయాణం చేసేటప్పుడు టైర్ స్లిప్ అయ్యి గుంతలో పడి ప్రమాదలు జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని అన్నారు. పెద్ద ఎత్తున వర్షాలు పడడం గమనించిన అక్రమార్కులు పగలు వంకను పరిశీలించి రాత్రిలో ట్రాక్టర్లు పెట్టి లెక్కలేనన్ని ట్రిప్పులు ఇసుకతవ్వి దారిని గుంతల మయంగా చేస్తున్నారని ఇప్పటికైనా దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే ఈ దారికి సంబంధించిన రైతులతో పెద్ద ఎత్తున రోడ్ల పై ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరించారు.
[zombify_post]