in , ,

మన్యంలో జోరుగా జోడ్ల పండుగ

అల్లూరి జిల్లా: మన్యం లో గిరిజనులు పండుగలు, ఆచారాలు విభిన్నంగా ఉంటాయి. పంటలు బాగా పండాలని ప్రతి ఏటా ఆగస్టు నెలలో గిరిజనులు జొడ్ల పండుగను ప్రతి గిరిజన రైతులు ఘనంగా నిర్వహిస్తుంటారు. వరినాట్లు పూర్తి అయిన తరువాత గిరిజన రైతులు ఈ పండుగ ను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పండుగ కు ప్రత్యేకంగా  గిరిజన రైతులు అడవికి వెళ్ళి కాస్మిక్  కర్ర అనే మొక్కల కర్రలను సేకరించి తీసుకువస్తారు. ఇలా సేకరించిన కాస్మిక్ కర్రతో సంకు దేవునికి పూజలు నిర్వహించి కోడిని కోసి ఆ రక్తాన్ని బియ్యంలో కలుపుతారు. ఇలా కోడి రక్తం కలిపిన బియ్యాన్ని వరిపొలాల్లో చల్లి అడవినుంచి సేకరించిన కాస్మిక్ కర్రలను పొలంలో పాతి పెడతారు. ఇలా చేయడం పొలంలో క్రిమి కీటకాలు బారిన పడకుండా పంటలు బాగా పండుతాయని మన్యంలో గిరిజనుల నమ్మకం. అనంతరం విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆనందంగా గడుపుతారు.

[zombify_post]

Report

What do you think?

జర్వాల రోగులతో జిల్లా ఆస్పత్రి కి కిటకిట

మన్యం రొయ్యలు భలే టేస్ట్