జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ,మండలానికి చెందిన 16 మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 16 లక్షల రూపాయల విలువగల చెక్కులను రాయికల్ పట్టణ వర్తక సంఘం లో అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ …దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కల్యాణ లక్ష్మి పథకం ఆమలు అవుతుందని ఇప్పటి వరకు 1 లక్ష 70 వేల వరకు ఆడబిడ్డల ఖాతాలో జమ చేశామని చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకం తో బాల్య వివాహాల తగ్గుదల తగ్గాయని,పెళ్ళిళ్ళు కు చట్టబద్దత వచ్చిందని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలకు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని ఆరోగ్య మహిళ,శీ టీమ్స్,డబల్ బెడ్ రూం ఇండ్ల,కళ్యాణ లక్ష్మి,బీడీ పెన్షన్,కేసిఆర్ కిట్,అరోగ్య లక్ష్మి,మహిళ గురుకుల కళాశాలలు తదితర కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శం అని తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని అన్నారు.జగిత్యాల నియోజకవర్గంలో 22 వేల మందికి బీడీ పెన్షన్ వస్తుంది.మహిళలు అనుకుంటే బి అర్ ఎస్ పార్టీ కి,కేసిఆర్ తిరుగులేదు అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు,ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్,zptc అశ్విని జాదవ్,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,amc ఛైర్మెన్ రాణి సాయి కుమార్,పాక్స్ ఛైర్మెన్ మల్లారెడ్డి,amc వైస్ చైర్మన్ మల్లేష్,జిల్లా ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు నాగరాజు,సర్పంచుల ఫోరం శ్రీనివాస్,మాజీ amc ఛైర్మెన్ గన్నే రాజీ రెడ్డి,కమిషనర్సంతోష్,mroఖయ్యాం,సర్పంచులు,కౌన్సిలర్ లు,ఉప సర్పంచి లు,నాయకులు,అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]