రాయికల్ పట్టణ,చర్ల కొండా పూర్ పెద్ద చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద 100% రాయితీ తో 1 లక్ష 70వేల ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెరువులో చేప పిల్లలను విడుదల చేసి, పూల తో చెరువు కు పూజలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అపర భగీరథుడు.ముఖ్యమంత్రి కేసిఆర్ అని ,చెక్ డ్యాం లు,కాళేశ్వరం,మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చుక్కను ఒడిసి పట్టి తెలంగాణ ను పచ్చగా మార్చారు అని అన్నారు.జగిత్యాల నియోజకవర్గములో 63 కోట్ల తో 180 చెరువులు పూడిక తీయటం జరిగిందని, గతంలో ఒక్క నాయకుడు చెరువులను పట్టించు కోలేదు అని అన్నారు
నియోజకవర్గం లో 140 చెరువుల్లో చేప పిల్లల పంపిణీ చేయటం జరిగింది.నియోజకవర్గం లో ఆడబిడ్డల కోసం చెరువుల వద్ద బతుకమ్మ మెట్ల నిర్మాణం,తద్వారా అందరికీ ఉపయోగంగా మారాయి.గంగ పుత్రులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది.చెక్ డ్యాం నిర్మాణం వల్ల నీళ్ళు నిలిచి,భూగర్భ జలాలు పెరిగి గంగ పుత్రులకు వరంగా మారాయి..
రాయికల్ మండలంలో 30 కోట్ల తో చెక్ డ్యాం ల నిర్మాణం.అన్ని మండలాల్లో చెక్ డ్యాం ల నిర్మాణం చేపట్టడం కోసం ముఖ్యమంత్రి గారి కృషికుల వృత్తులు అభివృద్ది కి ముఖ్యమంత్రి గారి కృషి.ఊహకు అందని విధంగా రాయికల్ పట్టణం అభివృద్ధి. D 52 కెనాల్ కి తూం పెట్టడం ద్వారా తొంబారావు పేట నుండి బోర్న పల్లి వరకు జలకలను సంతరించుకుంది. గంగపుత్రులకు ఉచిత చేప పిల్లలు లైఫ్ జాకెట్లు తేప్పలు వలలు ఇవ్వడం జరిగిందని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ మత్స్య కారులకు ఎంత బడ్జెట్ కేటాయించారు చెప్పాలి అని ప్రశ్నించారు. మత్స్య శాఖ పై ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ద పెట్టారు అని జగిత్యాల నియోజకవర్గం లో 13 కోట్ల 65 లక్షల తో గంగ పుత్రులు కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు.గతంలో ఎంత బడ్జెట్ కేటాయించారు అనేది గంగపుత్రులు ఆలోచన చేయాలి…
రాయికల్ పెద్ద చెరువు కట్ట అభివృద్ధి చేసి,మిని టాంక్ బండ్,పార్క్ ఏర్పాటు కు 1 కోటి 50 లక్షలు ఖర్చు చేస్తున్నాం. 34 లక్షలతో చెరువు పై మత్తడి నిర్మాణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కి ముందు ఎన్ని బీసీ గురుకులాలు ఉండే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ప్రజలు గుర్తు చేసుకోవాలి. ఒక్కో గురుకుల పాఠశాలలో ఒక్కో విద్యార్థి పై ఏడాదికి 1 లక్ష 25 వేల ఖర్చు చేస్తున్నాం అని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు,ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్,zptc అశ్విని జాదవ్,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,amc ఛైర్మెన్ రాణి సాయి కుమార్,పాక్స్ ఛైర్మెన్ మల్లారెడ్డి,సర్పంచ్ రాజ్యలక్ష్మి లక్ష్మీనారాయణ,ఉప సర్పంచ్ జ్యోతి సాయి రెడ్డి,గ్రామ శాక దేవుని రవి,జిల్లా మత్స్య శాక అధికారి దామోదర్,కమిషనర్ సంతోష్,గంగ పుత్ర సంఘం అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు, కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,గంగ పుత్రులు,అధికారులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]