in ,

ఐదేళ్లకొకసారి గ్యాస్ పైపు మార్చుకోవాలి

-ఇండేన్ శ్రీ వేంకటేశ్వర గ్యాస్ నిర్వాహకులు వందనపు సత్యనారాయణ

గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ప్రతి ఐదేళ్లకొకసారి సురక్ష పైప్ (గ్యాస్ పైప్) మార్చుకోవాలని ఇండేన్ శ్రీ వేంకటేశ్వర గ్యాస్ నిర్వాహకులు వందనపు సత్యనారాయణ పేర్కొన్నారు. తమ కార్యాలయంలో ఈ పైపును కొనుగోలు చేసి మార్చుకున్నట్లయితే వినియోగదారు నంబర్ కు కంప్యూటర్లో అప్డేట్ చేయబడుతుందన్నారు. కార్యాలయం నుంచి మెకానిక్ తనిఖీ చేసేందుకు వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి వినియోగదారుడు వారికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గ్యాస్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తనిఖీకి వచ్చినందనకు రూ.236లు, సురక్ష పైప్ కొత్తది బిగించినందుకు రూ.190లు మొత్తం రూ.426లు ఖర్చవుతుందని వివరించారు. అనుకోకుండా గ్యాస్ లికేజీ వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగినట్లయితే కేంద్ర నిబంధనల ప్రకారం మీకు జరిగిన నష్టానికి బీమా ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

[zombify_post]

Report

What do you think?

వాడపాలెం ఆలయం శంకుస్థాపనలో బండారు శ్రీనివాస్

ఢిల్లీకి స్క్రీనింగ్ లిస్ట్..