పాడేరు, అల్లూరి జిల్లా: ఓటరు సవరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు . గురువారం కలెక్టరేట్ నుండి రెవెన్యూ అధికారులతో ఫారం 8 సేకరణ , వంద సంవత్సరాలపై బడిన ఓటర్లు గుర్తింపు, ఒకే ఇంట్లో 10 మంది ఓటర్లు ఉన్న ఓటర్లు పరిశీలన, జీరో డోరు నెంబర్ల ఇళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సేకరించిన ఫారం 6, 7,8 లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి సచివాలయం సిబ్బంది సేవలను వినియోగించు కోవాలని సూచించారు. ఓటరు జాబితా రూప కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, పాడేరు ఐటిడి ఏ పిఓ వి. అభిషేక్,రంప చోడవరం ఐటిడి ఏ పిఓ సూరజ్ గనోరే, సబ్ కలెక్టర్ శుభం బన్సల్, పాడేరు, అరకువ్యాలీ, రంపచోడవరం తాహశీల్దార్లు, ఎలక్షన్ డిప్యూటీ తాహశీల్దారులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]