*9 లక్షల రూపాయలు గంగ పాలు*
*కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన సర్పంచ్ గుంటి లతాశ్రీ*!
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి -మర్లపెట మధ్యలో చెప్పట్టిన కల్వర్టు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా తు తు మంత్రంగా నిర్మించిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ గుంటి లతాశ్రీ తో పాటు ప్రజలు కోరారు.
బోయినిపల్లి -మర్లపేట రహదారిలో బోయినిపల్లి శివారులో గత ఏడాది బారి వర్షాల వల్ల బోయినిపల్లి చెరువు మత్తడి దూకడం తో కల్వర్టు కొట్టుకుపోగ సర్పంచ్ గుంటీ లతా శ్రీ శంకర్ లు తాత్కాలిక మరత్తులు చేపట్టి రాక పోకల కు అంతరాయం కలుగకుండా చేశారు.అయితే శాశ్వత బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం 9 లక్షలు మంజూరు చేసి ఓపెన్ టెండర్ వేయగా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా బ్రిడ్జి నిర్మించడం తో నాలుగు నెలలు కూడా కాకుండానే ఇటీవల కురిసిన వర్షానికి కొట్టుకొని పోయింది.దీంతో 9 లక్షల రూపాయలు నీటి పాలయ్యాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ రాక పోకలకు ఇబ్బంది అవుతుంది. సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని శాశ్వత బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
[zombify_post]