ఆదోని న్యూస్ :- మార్పు ఓటుతోని సాధ్యపడుతుందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్ శాతాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు ఆదోని సబ్ కలెక్టర్ / ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ శర్మ..
కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నుండి మున్సిపల్ హైస్కూల్ వరకు స్వీప్ ఓటు హక్కు అవగాహన పై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆదోని సబ్ కలెక్టర్/ ఆదోని ఎన్నికల అధికారి శివ్ నారాయణ్ జెండా ఊపి ప్రారంభించారు ర్యాలీలో సబ్ కలెక్టర్, ట్రైనీ డిఎస్పి ధీరజ్, పోలీసు అధికారులు, మున్సిపల్ అధికారులు, బి ఎల్ వో లు, సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ…. ఆదోని నియోజకవర్గం లో 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలన్నారు. ఓటర్ నమోదు శాతాన్ని పెంచుకోవాలసిన అవసరం ఉందని సబ్ కలెక్టర్ అన్నారు. ఓటర్లు బాధ్యతగా బయటకు వచ్చి ఓటు వేయాలనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.
This post was created with our nice and easy submission form. Create your post!