🔷 *రైతు గర్జన ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఆలూరు అసెంబ్లీ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు చిప్పగిరి లక్ష్మీనారాయణ..*
👉 కర్నూలు నగరం నందు పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారి అధ్యక్షతన కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు కె. బాబురావు గారు లక్ష్మీ నరసింహ గార్ల ఆధ్వర్యంలో జరిగిన రైతు గర్జన ర్యాలీలో పాల్గొన్న ఆలూరు నియోజకవర్గం నుంచి హలహర్వి, చిప్పగిరి, హోలగుంద, ఆలూరు మండలాల నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
👉 రైతు గర్జన ర్యాలీకి cwc సభ్యులు రఘువీరా రెడ్డి గారు, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మయప్పన్ గారు, మీడియా ఛైర్మన్ తులసి రెడ్డి గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి గారు, జంగా గౌతమ్ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు తాంతీయ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

👉 ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి, హలహర్వి, ఆలూరు మండలాలోని దాదాపు 28,000 వేల ఎకరాలకు హంద్రీనీవా నుంచి ఏబీసీ కెనాల్ కు సాగునీరు లేక మిరప, వరి, పత్తి, శనగ, మరియు జోన్న పంటలు పూర్తిగా ఎండిపోయాయని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధి కూడా పట్టించుకోవడం లేదని యుద్ధ ప్రాతిపదికన నీటి తూము ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందించారు.
👉 అనంతరం జిల్లా అధ్యక్షులుగా కె. బాబురావు గారు బాధ్యతలు స్వీకరించారు.
👉 ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాలి మల్లికార్జున, ఆలూరు మండల అధ్యక్షులు తుంబలబీడు లక్ష్మన్న, ఎస్సీ సెల్ తాలుకా అధ్యక్షులు లింగం పల్లి రామాంజనేయులు, ఉపాధ్యక్షులు హులేబీడు ఈరన్న, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, కరెంటు గోవిందు, హలహర్వి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్ కుమార్, జిలాన్ భాష, యూత్ కాంగ్రెస్ నాయకులు చిప్పగిరి వినోద్ కుమార్, రాజన్న, రామకృష్ణ, మూర్తి పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!