*నవంబర్ 15 చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి*
సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజారక్షణభేరి బస్సు యాత్రలు ముగింపు సందర్భంగా నవంబర్ 15వ తేదీన విజయవాడలో వేలాది మందితో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే వెంకటేశులు మండల కార్యదర్శి కే లింగన్న పిలుపునిచ్చారు.
చలో విజయవాడకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేస్తూ వారు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలకు తీవ్రమైన భారాలు మోపే పరిపాలన కొనసాగిస్తుందని, నిత్యవసర వస్తువులు ధరలు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుంటే దానికి పరిష్కారం చూపవలసింది పోయి ప్రధానమంత్రి మోడీ గారు చాయ్ అమ్మండి, బజ్జీలమ్మండని నిరుద్యోగులను హేళనగా మాట్లాడడం జరిగిందన్నారు.

మరోపక్క మన రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ యువజన చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ కూడా అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పాపం బిజెపికే దక్కుతుందని వారు తెలిపారు.
అలాంటి పార్టీకి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలు వైసిపి తెలుగుదేశం జనసేన పార్టీలు భజన చేస్తూ ఉన్నాయని, ప్రజా సమస్యలను విస్మరించి రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను ఎన్నికల అజెండగా చేర్చడం కోసం ప్రజా ప్రణాళికను సిపిఎం పార్టీ ఈ బహిరంగ సభలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
నవంబర్ 15వ తేదీన విజయవాడలో జరిగే బహిరంగ సభకు సిపిఎం పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారు, మరియు పోలిట్బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, ఇతర అగ్ర నాయకులు పాల్గొంటారని ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి వీరారెడ్డి, మండల నాయకులు రామాంజనేయులు, హనుమంత్ రెడ్డి, లక్ష్మన్న, పార్టీ నాయకులు విరుపాక్షి, హుసేని, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!