కొవ్వూరు రూరల్ మండలం మద్దూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనందు డైనింగ్ హాల్, సైకిల్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శనివారం జడ్పీ హైస్కూల్ ఆవరణలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. పిల్లల భవష్యత్ కోసం ఆలోచించి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్య్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ నూతన నిర్మాణానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించిన క్యాడ్బరీ సంస్థ వారికి, సహకరించిన రైతులకు, గ్రామ పెద్దలకు హోంమంత్రి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!