*ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి*
*CPS ను రద్దు చేసి OPS ను అమలు చేయాలి*
*UTF నిరవధిక దీక్షకు మద్దతు తెలిపిన SFI నాయకులు*

ఆదోనిలో ఉపాధ్యాయులు CPS ను రద్దు చేసి OPS ను అమలు చేయాలని UTF ఆధ్వర్యంలో నిరవధిక దీక్ష చేపట్టారు.ఈదీక్షకు SFI ఆదోని పట్టణ కమిటీ మద్దతు తెలిపారు.ఈసందర్భంగా SFI జిల్లా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఇచ్చిన హామీని మర్చిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల.న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ఉపాధ్యాయులు చేసే పోరాటాలకు విద్యార్థుల తరఫున SFI గా మద్దతు తెలుపుతామని తెలిపారు. అనంతరం సాయంత్రం SFI పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు.ఈ కార్యక్రమంలో భరత్, గణేష్, నాగార్జున, పవన్ , గౌస్, శశి, దినేష్, మోనేష్ పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!