in ,

జిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి.

ఆదోని యుటిఎఫ్ :- జిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలి రాష్ట్ర ప్రభుత్వము CPS స్ధానములో GPS అనే కొత్త పెన్షన్ విధానమును అమలులోకి తెచ్చింది. GPS ను రద్దు చేసి పాత పెన్షన్ విధానమును అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా “నిరాహార దీక్షలు” కొనసాగుచున్నవి.అందులో భాగంగా  ఆదోని విజయభాస్కర్ రెడ్డి సర్కిల్లో వద్ద నిరసన దీక్షలు ప్రారంభించడం జరిగింది నిరసన దీక్షలను సీనియర్ నాయకులు కృష్ణమూర్తి గారు సునీల్ రాజ్ కుమార్ ప్రారంభించారు. సందర్భంగా సీనియర్ యుటిఎఫ్ నాయకులు పాపయ్య గారు మాట్లాడుతూ…………… “గత ఎన్నికలలో పాదయాత్రలో భాగంగా CPS పెన్షన్ విధానమును రద్దు చేసి పాత పెన్షన్ విధానమును అమలు చెస్తానన్నాడు.వారంలో చేస్తానని ఇచ్చిన మాట 5 సంవత్సరములు కావచ్చినా CPS ను రద్దుచేయకపోగా GPS అనే కొత్త విధానమును అమలు చేయడం జరిగింది. అందుకు నిరసనగా శుక్రవారం నిరసన దీక్షలు చేయవలసి వచ్చింది.GPS రద్దు అయ్యెంతవరకు  దీక్షలు కొనసాగిస్తామని UTF జిల్లా కార్యదర్శి గాది లింగప్ప చెప్పారు. ప్రభుత్వము ఉద్యోగ,ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందని,ఉద్యోగులు దాచుకున్న సొమ్మును ప్రభుత్వము దోచుకుంటున్నారని,నూతన DSC కి అవకాశము లేకుండా చేశారు.117 జి.ఓ వలన ఉపాధ్యాయులు లేక ,పిల్లలు లేక వెల వెల పోతున్నాయన్నారు.విద్యారంగం పూర్తిగా  నాశనమైందని నరసయ్య గౌడ్ గారు అన్నారు.

     ఈ దీక్షలకు సంఘీభావంగా STU నాయకులు నాగరాజు నరసింహులు సుంకన్న రవికుమార్ గోపాల్ రమేష్ నాయుడు సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు గోపాల్ గారు సిఐటియు నాయకులు ఎస్ఎఫ్ఐ నాయకులు శిభిరం వద్ద సంఘీభావాన్ని ప్రకటించారు.దీక్షలు చేస్తున్న జిల్లా ఆడిట్ సభ్యులు శ్రీనివాసులు,మల్లికార్జున ఆదోని మండలం రూరల్ అధ్యక్షులు రామాంజనేయులు మండల ప్రధాన కార్యదర్శి ఓంకార్, ఆలూరు బాధ్యులు బసవరాజ్, మంగయ్య, చంద్రశేఖర్ నాయుడు దీక్షలలో కూర్చున్నారు పాత పెన్షన్ సాధించేంతవరకు దీక్షలు కొనసాగిస్తామన్నారు.

 గాది లింగప్ప జిల్లా కార్యదర్శి, ఆదోని.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by G.Raju

Creating Memes
Top Author
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Trending Posts
Post Views

ఎస్ ఎస్ ట్యాంక్ లో జాలరు చేతికి చిక్కిన ముసలి..

ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి.