బొలెరో వాహనం, పాలవ్యాన్, స్కూటర్కు ఢీ
కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి పాల వ్యాన్ను మరియు స్కూటర్ను ఢీ కొట్టడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకెళ్తే నరసరావుపేటకు చెందిన ఓనర్ రవితేజ, డ్రైవర్ సింహాద్రి మెడిసిన్ వేసుకుని ఆదోనికి వస్తుండగా అదుపుతప్పి పాల వ్యాను, స్కూటర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నరసరావుపేటకు చెందిన రవితేజ డ్రైవర్ సింహాద్రి కి, అమరావతికి చెందిన పాల వ్యాన్ డ్రైవర్ చరణ్ కు, స్కూటర్ పై ఉన్న ఎమ్మిగనూరు మండలం ఫిరాలదొడ్డి గ్రామానికి చెందిన వీరారెడ్డి కి గాయాలయ్యాయి అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు గాయపడిన వారిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి జరిగిన కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నరు.
This post was created with our nice and easy submission form. Create your post!