in ,

పార్టీ ని నడిపే దమ్ము పవన్ కళ్యాణ్ కి లేదు మంత్రి అమర్నాథ్

భవిష్యత్తులో చంద్రబాబుకు అధికారం దక్కదు

-పార్టీని నడిపే దమ్ము పవన్ కళ్యాణ్ కి లేదు

గురు న్యూస్ విశాఖపట్నం : చంద్రబాబు నాయుడు బతికున్నంత కాలం అధికారంలోకి రాలేడని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నవంబర్ ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న ‘ఎందుకు ఆంధ్రకి జగనన్న కావాలి’ అన్న కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులకు వివరించే కార్యక్రమం అనకాపల్లి మండలం మార్టూరు గ్రామంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదని, పైగా ఆయన ఇచ్చిన హామీలేవి అమలకు నోచుకోలేదని అన్నారు. అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు 98% అమలు అయ్యాయని అన్నారు. చంద్రబాబు వివిధ నేరాలలో ఇరుక్కుని జైలుకు వెళ్లాడని, ఈ విషయాన్ని న్యాయస్థానం కూడా నమ్ముతోంది కాబట్టే ఆయనకు బెయిల్ ఇవ్వటం లేదని అని అన్నారు. మళ్లీ ఎన్నికల సమయంలో బయట వచ్చి అమలు సాధ్యం కానీ హామీలను ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడని అమర్నాథ్ చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. ఇక చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకుంటాడని జగన్మోహన్ రెడ్డి చాలా కాలం నుంచి చెబుతూ వస్తున్నారని, ఈ పొత్తు అక్రమ సంబంధాన్ని తలపిస్తోందని అమర్నాథ్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ కు పార్టీని నడిపే దమ్ము లేదని, ఒంటరిగా పోటీ చేసే సత్తా లేదని అందుకే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడని ఆయన అన్నారు. ప్రజలకు కష్టం వస్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఆదుకున్నాడా? అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి వచ్చిన, వైసీపీని ఢీకొనలేవని గత ఎన్నికల్లో కన్నా, మరింత అత్యధిక మెజార్టీతో తమ పార్టీ అధికారులకు రాబోతుందని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే పథకాలు మరింత సమర్థవంతంగా కొనసాగుతాయని అమర్నాథ్ హామీ ఇచ్చారు. నవంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ‘ఎందుకు ఆంధ్రాకి జగనన్నే కావాలి’ కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, జడ్పీటీసీలు ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు కచ్చితంగా పాల్గొనాలని అమర్నాథ్ చెప్పారు. ప్రతి గ్రామంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆయా ప్రాంతాలలో వివిధ పథకాల కింద లబ్ధి చేకూరిన వివరాలను పొందుపరుస్తూ డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఆ గ్రామ సచివాలయ పరిధిలో పార్టీ పతాకాన్ని ఏర్పాటు చేసి, దానిని ఆవిష్కరించాలని చెప్పారు. అలాగే ప్రతి వైసిపి కార్యకర్త ఇంటి మీద పార్టీ జెండా ఎగరేయాలని చెప్పారు. ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు గ్రామంలో ప్రముఖ నాయకులను, గ్రామ పెద్దలను పిలిచి, చంద్రబాబు పాలనకు, జగన్మోహన్ రెడ్డి పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించాలని, అలాగే వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని మంత్రి అమర్నాథ్ సూచించారు. ఆ రాత్రికి పార్టీ ముఖ్య నాయకులందరూ అదే గ్రామంలో బస చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన గురించి ప్రజలకు తెలియజేయాలని, జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాల గురించి వివరించాలని మంత్రి అమర్నాథ్ సూచించారు. మరుసటి రోజు ఉదయం వీరంతా అదే గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలపై రూపొందించిన కార్డును వారికి అందజేసి, ఎవరు ఎన్ని హామీలు నెరవేర్చారు అన్న అంశాన్ని వారిని అడిగి వాటిపై టిక్కులు పెట్టించాలని మంత్రి అమర్నాథ్ సూచించారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలే ఎక్కువగా నెరవేరినందువలన ప్రజల నుంచి ఎక్కువ మార్కులు జగన్మోహన్ రెడ్డికే వస్తాయి. ఆ తర్వాత ‘ఆపు బాబు నీ నాటకం.. జగనన్నే మా నమ్మకం’ అన్న స్టాంపును సంబంధిత బుక్లెట్లో వేయించి పార్టీ నాయకులు ఆ కార్యక్రమాన్ని ముగించాలని మంత్రి అమర్నాథ్ చెప్పారు . గతంలో చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలు ఏ విధంగా విజయవంతం చేశారో, ఈ కార్యక్రమాన్ని కూడా అంతకుమించి దిగ్విజయం చేయాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Balakishan

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs

వైవీ సుబ్బారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్ ముందు