గురు న్యూస్ విశాఖపట్నం :వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందిస్తున్న పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నక్క కనకరాజు ఆకస్మికంగా మృతి చెందారు. అతని మృతదేహానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం నివాళులర్పించారు . 2014 నుంచి వైసీపీకి పెందుర్తి మండల అధ్యక్షులుగా చేసి, ప్రస్తుతం జేసీఎస్ మండల కన్వీనర్, కోఆప్షన్ మెంబర్ గా కనకరాజు కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ కనకరాజు మరణం పార్టీకి తీరని లోటని, ఆయన అకాల మృతికి చింతిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు.కనకరాజు మరణ వార్త తట్టుకునే శక్తిని వారి కుటుంబానికి ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అమర్నాథ్ అన్నారు. ఈ కార్యక్రమం లో పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!