రోడ్డు పై బైక్ తగలబడిన సంఘటన సోమవారం ఏలూరు జిల్లా లో చోటుచేసుకుంది. జీలుగుమిల్లి మండలం పాలచర్ల గ్రామానికి చెందిన నలుగురు పిల్లలు బైక్ ను ఇంటినుంచి బయటకు తీసుకుని వచ్చి నడుపుతుండగా పెట్రోల్ అయిపోయింది. దీంతో ఓ బాలుడు ట్యాంక్ ఓపెన్ చేయగా మరో బాలుడు లైటర్ వెలిగించాడు. దీంతో ఒక్కసారి గా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి నీళ్ళు పోసి మంటలను అదుపు చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆకతాయి చేష్టలతో ఈ విధంగా జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!