*కులోన్మాద దాడులను, హత్యలను ఖండిస్తూ సభలు, సదస్సులు జరపండి. ~ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆదోని,
ఆదోనిలో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ఈ సమావేశానికి నాగేంద్రప్ప అధ్యక్షత వహించగా ముఖ్య వ్యక్తిగా వచ్చినటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ….. సత్యశోధక్ సమాజ్ స్థాపన లక్ష్యం సమాజములో ఉన్న అణగారిన కులాలకు విద్యను అందించడం. సత్యశోధక్ సమాజ్ లో సభ్యత్వమునకు ఉన్నత వర్గాల ప్రజలు అంటే బ్రాహ్మణులు, ధనవంతులకు, ఉన్నతాదాయ వర్గాల వారికి అనుమతి లేదు. ఈ సమాజంలో అణగారిన వర్గాల వారికి మాత్రమే సభ్యత్వము ఇవ్వబడినది. జ్యోతిరావు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, బ్రాహ్మణుల అశాస్త్రీయ, సనాతన పద్ధతులకు వ్యతిరేకంగా ఉన్నాడు. మత పుస్తకాలలోని అసమానత, సనాతన స్వభావం, అసమానతలకు, దురాచారాలకు వ్యతిరేకంగా రచనలు చేశారు. హిందూ మతంలో మానవ శ్రేయస్సు, ఆనందం, ఐక్యత, సమానత్వం, ఆచారాలు వంటి కొన్ని ఆలోచనలను మనస్సులో ఉంచుకుని, మహాత్మా జ్యోతిరావు ఫులే “దీన బంధు” అనే వార్తాపత్రికను ప్రారంభించి, తన అభిప్రాయాలను తెలిపినాడు. తాము దేవుని దూతగా భావించిన బ్రాహ్మణులపై సత్యశోధక్ సమాజము విశ్వసింపక బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. సత్యశోధక్ సమాజ్ వారు ఉపనిషత్తులు, వేద సంస్కృతిని నమ్మలేదు. ఆర్యన్ సమాజాన్ని గౌరవించటానికి కూడా వీరు తిరస్కరించారు. మరాఠా పాలకుడు షాహు మహారాజ్ ఫులే మరణించిన తరువాత ఈ ఉద్యమం ఆగిపోలేదు. ఆ తరువాత భరావు పాటిల్, మరాఠా నాయకులు కేశవరావు జెధే, నానా పాటిల్, ఖండేరావ్ బాగల్, మాధవరావు బాగల్ ఈ ఉద్యమాన్ని విస్తరించారు.
మహాత్మా జోతిరావు సత్య శోదక్ సమాజ్ మొదటి అధ్యక్షుడిగా, కోశాధికారిగా, నారాయణరావు గోవిందరావు కడలక్ మొదటి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. శూద్రులను బ్రాహ్మణ గ్రంథాల ప్రభావం నుండి విమోచించడం, శూద్రులను మత బానిసత్వం నుండి , విగ్రహ ఆరాధన ఖండించడం ,అందరు ఒకే దేవుడి పిల్లలు, ఆ పిల్లలు దేవునికి అర్పించడానికి పూజారి లేదా మత గురువుల వంటి మధ్యవర్తుల అవసరం లేదు. సంస్థ యొక్క ప్రధాన లక్ష్యాలలో శూద్రులను ఉన్నత కులాల వారినుంచి రక్షించించడం , సత్య షోధక్ సమాజ్ ద్వారా, వేదాలను పవిత్రంగా పరిగణించదానికి జోతిరావు అంగీకరించ లేదు . సమాజములో చతుర్వర్ణ వ్యవస్థను (కుల వ్యవస్థ) ఖండించారు. 1930 వ సంవత్సరములో మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సామూహిక ఉద్యమంతో జెధే వంటి సమాజ్ నాయకులు కాంగ్రెస్‌లో చేరారు. దీనితో సత్య సమాజ్ కార్యకలాపాలు ఆగిపోయినవి. ఈ సత్యశోధక్ సమాజ్ ఆశయాల కోసం సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉద్యమొస్తుంది అని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకప్ప, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు ,ప్రసాద్, ఏఐకేఎంఎస్ రాజు, ఏసెఫ్, పి.డి.ఎస్.యూ నాయకులు అఖండ, నరేష్, ఈశ్వర్, వీరేష్ పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!