మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రకాశం జిల్లా గిద్దలూరు జడ్పిటిసి బుడత మధు తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ సమక్షంలో టిడిపి పార్టీలో చేరనున్నట్లు మాజీ జెడ్పిటిసి మధు తెలిపారు. ఈ విషయాన్ని జడ్పిటిసి బూడత మధు అధికారకంగా ప్రకటించారు.