in , , ,

భువనేశ్వరి, బ్రహ్మణీలకు ఐటీ ఉద్యోగులు సంఘీభావం

రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ఉన్న శిబిరం వద్ద నాలుగు వైపులా పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. బయట నుంచి వచ్చే కార్లను తనిఖీలు చేసి పంపిస్తున్నారు. చంద్రబాబు సాఫ్ట్వేర్ రంగానికి ఎనలేని సేవలు అందించారని. ఆయన ముందుచూపుతోనే తామంతా ఉద్యోగాలు సాధించామని స్థానిక ఐటీ ఉద్యోగులు వివరించారు. ఆయనను అన్యాయంగా, అక్రమంగా అరెస్టు చేశారని. నిరసిస్తూ తామంతా ర్యాలీ చేపడితే పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఐటీ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు వివిధ ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం వచ్చి మహిళలు సంఘీభావం తెలుపుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నుంచి వచ్చిన మహిళలు బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. అన్యాయంగా బాబుని అరెస్ట్ చేశారని ఆయన త్వరలోనే బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

కాసేపట్లో న్యాయమూర్తి ముందుకు చంద్రబాబు

పాములపాడు మండలం లో అత్యధిక వర్షపాతం…