విశాఖపట్నం సెప్టెంబర్ 24:- సీతంపేట దుర్గా గణపతి ఆలయంలో నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవంలో భాగంగా మేయర్ దంపతులు గణనాధునికి హోమం, అభిషేకం, సహస్ర నామావళి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ దంపతుల మాట్లాడుతూ ఆ గణనాథుని కృప ఎల్లవేళలా నగర ప్రజలపై ఉండాలని, నగరాభివృద్ధికి అనుగ్రహం ఉంచాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఎటువంటి ఆటంకాలు లేకుండా విశాఖ పరిపాలన రాజధాని అయ్యేటట్లు కరుణించాలని వేడుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో 25 వ వార్డు కార్పొరేటర్ సారిపల్లి గోవిందా, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!