తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపు చర్య అని జనసేన నేతలు అన్నారు.
- ★ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్ లు నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు.
- ★ పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ నేతృత్వంలో వచ్చిన ఇంచార్జ్ లు, నేతలు నారా బ్రాహ్మణిని కలిసి తమ మద్దతు ప్రకటించారు.
- ★ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని…రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని వారు అన్నారు.
- *ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ…*
- ★ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు.
- ★ చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు, రిపోర్టులు తాను పరిశీలించానని…. చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా ఎక్కడా లేదని అన్నారు.
- ★ రాజకీయ కక్ష తప్ప ఈ కేసు మరొకటి కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
- ★ ఈ స్థాయి విధ్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు.
- ★ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని….గంజాయి, డ్రగ్స్ మాత్రమే ఉన్నాయని బ్రాహ్మణి అన్నారు.
- ★ తెలుగు దేశం, జనసేన.. రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటు పై లోకేష్ చర్చిస్తున్నారని తనను కలిసిన జనసేన నేతలకు ఆమె తెలిపారు.
- ★ ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్న బ్రాహ్మణి…..స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
- *మద్దతు తెలిపిన వారిలో ముత్తా శశిధర్, తోట సుధీర్,తుమ్మల రామ స్వామి బాబు,పితాని బాలకృష్ణ, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, పోలిశెట్టి చంద్ర శేఖర్, గంటా స్వరూపా రాణీ, బత్తుల బల రామకృష్ణ, వాసిరెడ్డి శివ, మర్రెడ్డి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్య
- బాబు తదితరులు ఉన్నారు.*
This post was created with our nice and easy submission form. Create your post!