ఎస్ కోట ప్రభుత్వ ఆసుపత్రి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
విజయనగరం జిల్లా ఎస్. కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మహిళలు, పిల్లలు, ప్రసూతి, జనరల్, ఆరోగ్యశ్రీ వార్డులను సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య చికిత్సలు, ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, రోగులకు కల్పిస్తున్న భోజన సదుపాయాలపై ఆరాతీశారు. ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందిస్తున్న సేవలపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
[zombify_post]