తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పంచాయతీ పరిధిలో బుర్రిలంక ఆంజనేయస్వామి కాలువ రేవులో యువకుడు గల్లంతయ్యాడు. స్నానం చేయడానికి అదే గ్రామానికి చెందిన రవ్వల మోహనరావు(30) కాలువ రేవులో దిగాడు. అందరు చూస్తుండగానే కాలుజారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. మంగళవారం యువకుడు గల్లంతైనప్పటికీ బుధవారం నాటికి కూడా లేదు మృతదేహం లభ్యం కాలేదు. నీటిమట్టం అధికంగా ఉండటం వల్ల గాలింపు చర్యలు కష్టంగా మారింది. శ్రీకాకుళం నుంచి నర్సరీలలో పనిచేయడానికి రెండు దశాబ్దాల క్రితమే ఈ కుటుంబం వలస వచ్చింది. కాలువ నీటిమట్టం తగ్గించమని ఎంత మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మృతిని బంధువులు వాపోతున్నారు.మృతుడు మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. తన కుమారుడి మృత దేహం లభ్యమవ్వడానికి సహకరించాలని మోహనరావు తండ్రి సంపతరావు అధికారులను వేడుకుంటున్నాడు
[zombify_post]