కుర్మీ కులస్థులు తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బందుకు పిలుపు ఇవ్వడంతో మూడు రాష్ట్రాల్లో పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మకు షెడ్యూల్డ్ తెగ (ST) హోదా కల్పించాలని, కుర్మలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేస్తూ పలు కుర్మీ సంఘాలు సెప్టెంబర్ 20వతేదీ నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని తొమ్మిది రైల్వే స్టేషన్లలో నిరవధిక రైల్వే దిగ్బంధనానికి పిలుపునిచ్చాయి.
పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 20 రైళ్ల రాకపోకలను రద్దు చేస్తున్నట్లు , సౌత్ ఈస్ట్రన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో మరో 47 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు చెప్పారు.