-
సూర్యాపేట మండలాన్ని స్వచ్ఛతగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి.
-
సూర్యాపేట మండలాన్ని స్వచ్చతగా తీర్చిదిద్దడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఎంపిపి బీరవోలు రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
——————————————-
-
సూర్యాపేట:
సెప్టెంబరు 19: సూర్యాపేట మండలాన్ని స్వచ్ఛగా తీర్చిదిద్దడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని సూర్యాపేట ఎంపిపి బీరవోలు రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు.
స్వచ్ఛత హీ సేవ 2023 కార్యక్రమాన్ని సోమవారం నాడు సూర్యాపేట మండల పరిధిలోని సోలిపేట గ్రామంలో ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణలో భాగంగా గ్రామంలో కలియ తిరుగుతూ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు.గ్రామ ప్రజలు పంచాయతీ ట్రాక్టర్ కు చెత్తను తడి పొడి చెత్తగా వేరుచేసి అందించాలని కోరారు. ప్లాస్టిక్ వాడకుండా సహకరించాలని ఆయన గ్రామ ప్రజల్ని కోరారు .సూర్యాపేట మండలాన్ని స్వఛ్చత మండలంగా తీర్చిదిద్దుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.అంబేద్కర్ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో కార్యదర్శి చంద్రశేఖర్, గ్రామ సర్పంచ్ శోభా రాణి, ఉపసర్పంచ్ సుగుణమ్మ, వార్డు మెంబర్లు మరియు బిఆర్ యస్ పార్టీ సీనియర్ నాయకులు,ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఈదుల యాదగిరి,సీనియర్ నాయకులు బీరవోలు శేఖర్ రెడ్డి,మేకల జయరాములు,కందుల అశోక్ రెడ్డి ,బాదిని వీరయ్య, బొడ్డు శ్రీరాములు,చందా గోపాల్ ,కందుల కుశలవ రెడ్డి,రమావత్ జానయ్య,శ్రీరాములు,పోలెపాక శ్యామ్ సుందర్ ,ఉప్పుల వెంకన్న,గోళ్ళ రమేష్,మహిళలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]