పట్టించుకో వినాయక……….🙏
ఓ బొజ్జ గణపయ్యా.. వినాయకచవితి ఉత్సవాల వేళ.. భూలోకంలో ఉన్న మమ్మల్ని దీవించేందుకు, ఉండ్రాళ్లను ఆరగించేందుకు మా జిల్లాకు వచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా అడుగులు వేయాలి సుమా. జిల్లాలో ఏ రోడ్డు చూసినా గుంతలమయమే. ఎక్కడ చూసినా అధ్వానమే. చిన్నపాటి వర్షం కురిసినా చాలు.. రహదారిపై గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి.
వినాయకా.. ఈ రోడ్లు చూసితివా!
నీరు నిలిచిపోయిన బొబ్బిలి పట్టణంలో
– చవితి కోసం జాగ్రత్తగా విచ్చేయండి

– భక్తులూ.. జరభద్రం
ఓ బొజ్జ గణపయ్యా.. వినాయకచవితి ఉత్సవాల వేళ.. భూలోకంలో ఉన్న మమ్మల్ని దీవించేందుకు, ఉండ్రాళ్లను ఆరగించేందుకు మా జిల్లాకు వచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా అడుగులు వేయాలి సుమా. జిల్లాలో ఏ రోడ్డు చూసినా గుంతలమయమే. ఎక్కడ చూసినా అధ్వానమే. చిన్నపాటి వర్షం కురిసినా చాలు.. రహదారిపై గుంతల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఈ గుంతల్లో పడి ఇప్పటికి చాలామంది ప్రమాదాల బారిన పడ్డారు. అయినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. అందుకే మీరు మా భూలోకానికి మూషిక వాహనంపై వచ్చినప్పుడు ఆచితూచి అడుగేయాలి. మేము ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలి. ఈ రోడ్లను బాగు చేసేలా ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఉపదేశం చేయాలి. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా మమ్మల్ని ఆశీర్వదించాలి.
– భక్తుల విజ్ఞప్తి
……………
జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు గోతులు, రాళ్లతో నిండిపోయి ఉన్నాయి. వర్షం కురిస్తే చాలు గోతుల్లో నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఈ గుంతల్లో పడి చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ రోడ్లను పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విఘ్నాలు తొలగించే అధిపతి.. వినాయకుడైనా తమ సమస్యలు తొలగిస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘గణేశా.. గోతులు చూడయ్యా.. మా కోర్కెలతో పాటు రోడ్లను బాగుచేయించేలా పాలకులకు సద్బుద్ధి ప్రసాదించు అయ్యా’ అని వేడుకుంటున్నారు.
‘‘ఓ బొజ్జ గణపయ్య… మీరు భక్తులను దీవించేందుకు.. ఉండ్రాలను ఆరగించేందుకు మా జిల్లాకు వచ్చేటప్పుడు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా అడుగులు వేయాలి సుమా. లేదంటే ముడుకెడు లోతు గోతుల్లో దిగి పడిపోయే ప్రమాదం ఉంది.ఇప్పటికే మా జిల్లా ప్రజలు చాలామంది ఈ రోడ్లపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. మీరు కూడా ఇక్కడకు వచ్చి గోతుల్లో పడి ప్రమాదానికి గురైతే అది మా జిల్లాకే చెడ్డపేరు. అంతే కాకుండా ప్రభుత్వం, జిల్లా నేతల బండారం దేవలోకంలో కూడా బయటపడుతుంది. ఇది మా జిల్లాకు చెడ్డపేరే కదా స్వామీ.. అందుచేత మీరు భూ లోకానికి వచ్చేటప్పుడే కాస్త అప్రమత్తంగా, ఆచుతూచి అడుగేయాలి. మీరైనా ఈ రోడ్లను బాగు చేసేలా ప్రజాప్రతినిధులు, అధి కారులకు ఉపదేశం చేయాలని యావన్మది భక్తులం కోరుకుంటున్నాం.’’ జిల్లాలో ఎక్కడ చూసినా వినాయక మండపాలు కన్పిస్తున్నాయి. సోమవారం గణనాథుడు కొలువు దీరనున్నాడు. రోడ్లు గోతులమయంగా ఉండడంతో వినాయక నిమజ్జనాల సమయంలో భక్తులు జరభద్రంగా ఉండాల్సిన అవసరం ఉంది.
=====
ఇది రేగిడి మండలంలోని కొమిరి -వెంకటాపురం రోడ్డు. 7 కిలోమీటర్లు ఉన్న ఈ రోడ్డు దారుణంగా ఉంది. రహదారిపై అడుగుకో గొయ్యి దర్శనమిస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. ఇదే మండలంలోని డోలపేట-చిన్నయ్యపేట సెంటర్, లచ్చరాయపురం-మజ్జిరామునిపేట, చిన్నశిర్లాం-అంబాడ, ఉణుకూరు, ఉంగరాడమెట్ట-ఖండ్యాం, వన్నలి-సీతారంపురం రహదారులు కూడా ఇలాగే ఉన్నాయి. తమ పరిధిలో ఉన్న రోడ్లకు సంబంధించి మరమ్మతులకు ప్రతిపాదనలు పంపినట్లు రాజాం ఆర్‌అండ్‌బీ ఏఈ నాగభూషణరావు తెలిపారు.
============
నీరు నిలిచిపోయిన ఈ రోడ్డు బొబ్బిలి పట్టణంలోనిది. కాలేజీ రోడ్డు మీదుగా పూల్‌బాగ్ వెళ్లే ఈ రోడ్డు అధ్వానంగా ఉంది. రెండున్నర కిలో మీటర్లు ఉన్న ఈ రోడ్డుపై ఎక్కడికక్కడే గోతులు ఏర్పడి రాళ్లు తేలాయి. విద్యార్థులు, వాహనచోదకులు అవస్థలు పడుతున్నారు. అదే విధంగా బొబ్బిలి-పార్వతీపురం రాష్ట్రీయ రహదారి కూడా ప్రమాదకరంగా తయారైంది. ఇదే మండలంలోని ఎ.వెలగవలస, సీతయ్యపేట గ్రామాల రోడ్లు సైతం పాడైపోయాయి.
============
ఇది శృంగవరపుకోట పట్టణ పరిధిలోని విశాఖ-అరకు రోడ్డు. పోలీసు స్టేషన్‌కు ఎదురుగా వన్‌వై ట్రాఫిక్ రోడ్డుకు వెళ్లేదారిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో విశాఖ-అరకు, విజయనగరానికి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగేళ్ల నుంచి ఈ గుంతలు ఇలానే ఉన్నాయి. వీటిని పూడ్చకపోవడంతో రాత్రి సమయంలో వాహనచోదకులు ఈ గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే దేవిబొమ్మ కూడలి నుంచి పుణ్యగిరి ఆలయానికి వెళ్లే రహదారి కూడా గోతులతో నిండిపోయింది.
============
రాజాం-డోలపేట రోడ్డు నరకానికి నకళ్లుగా మారింది. కిలోమీటరు వరకూ గోతులు తప్ప రోడ్డు కనిపించని పరిస్థితి. చిన్నపాటి వర్షం కురిసినా గుంతల్లో నీరు చేరి కుంటలను తలపిస్తుంటాయి. దీం తో ఎక్కడ గుంతలున్నాయో తెలియక వాహనచోదకులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆటోలు, ద్విచక్ర వాహనాలు బోల్తా పడుతున్నాయి. రాజాం-శ్రీకాకుళం రోడ్‌లోనూ ఇదే పరిస్థితి.
============
వంగర మండలంలోని బాగెమ్మపేట- అరసాడ రోడ్డు ఇది. ఈ రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడా ్డయి. ఈ రహదారిపై ఇటీవల కొండవలస సెంటరు వద్ద బస్సు బోల్తా పడింది. గ్రానైట్ క్వారీ సమీపంలోని గోతుల్లో ద్విచక్ర వాహనాలు బోల్తాపడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇదే మండలంలోని వంగర- సీతారాంపురం రోడ్డు కూడా గోతులతో దారుణంగా మారింది.
============
ఇది విజయనగరం, గజపతినగరం నియోజకవర్గాల పరిధిలోని గుంకలాం- ఓంపిల్లి రహదారి. గోతులు ఏర్పడి రాళ్లు తేలిన ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే ప్రజలు హడలిపోతున్నారు. వర్షం పడితే నరకమే. ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు.
============
ఈ రోడ్డు చూశారా ఎంత దారుణంగా ఉందో. ఇది మెంటాడ మండలంలోని బగ్గాం చిట్టాయివలస రహదారి. ఈ రోడ్డు పూర్తిగా స్వరూపం కోల్పోయింది. గజానికో గొయ్యి దర్శనమిస్తోంది. ఛిద్రమైన ఈ రోడ్డుపై నిత్యం వాహనాలు కూరుకుపోతున్నాయి. వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. లోతుగెడ్డ-కొండపర్తి, అమరాయివలస -కొండలింగాలవలస, పెదమేడపల్లి వరకు రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి.
============
ఇది గంట్యాడ మండలంలోని తాటిపూడి మదుపాడ రోడ్డు. ఈ రహదారి పూర్తిగా గోతులతో నిండిపోయింది. గత 20 ఏళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోకపోవడంతో దారుణంగా తయారైంది. ఇదే మండలంలోని కొటారుబిల్లి కూడలి-బుడతనాపల్లి, సిరిపురం- వసంత రోడ్డు కూడా దెబ్బతిన్నాయి.
==========
మెరకముడిదాం మండలంలోని గర్భాం-గరివిడి రహదారి ప్రమాదకరంగా మారింది. గర్భాం ఆంధ్రా ఫెర్రో వద్ద, రేగటి సమీపంలో, పెదబంటుపల్లి, విపిరేగ, తదితర చోట్ల రహదారి దారుణంగా తయారైంది. వర్షం పడితే రోడ్డు ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది
.రిపోర్టర్ ప్రసాద్….🫡
[zombify_post]