in , , , ,

ఆత్మకూర్ కు..1300 ఏళ్ల చరిత్ర: మంత్రి జగదీష్ రెడ్డి

  • ఆత్మకూర్ కు ..1300  ఏళ్ల చరిత్ర

  • చరిత్రకు ప్రాణం పోసేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి ఆరాటం

  • మంత్రి చొరవతో వెలుగు చూసిన ఆత్మకూరు చారిత్రక వైభవం

  • పూర్వ వైభవం సంతరించుకోనున్న  అత్నకూర్ (యస్)  మండల కేంద్రంలో ఉన్న మెట్లబావి

  • పురావస్తు శాఖ అధికారులతో కలిసి మెట్ల బావితో పాటు చెన్నకేశవ ఆలయాన్ని సందర్శించిన మంత్రి జగదీశ్ రెడ్డి

  • చెన్నకేశవ స్వామి ఆలయంతో పాటు మెట్ల బావి చారిత్రకమైనదని తెలిపిన అధికారులు

  • పురావస్తుశాఖ అధికారుల పరిశోధనలో వెలుగు చూసిన 1200ఏళ్ల క్రితం నాటి గణపతి విగ్రహం

  • మంత్రి జగదీష్ రెడ్డి  ఆదేశాలతో ఇప్పటికే ప్రారంభమైన మెట్ల భావి పూడికతీత పనులు

  • ఆత్మకూరు చారిత్రక వైభవం ఎనలేనిదని కీర్తించిన పురావస్తు శాఖ అధికారులు

  • సూర్యాపేట

సూర్యాపేట నియోజకవర్గ లోని వారసత్వ ప్రదేశాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి  

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీష్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నేడు ఆత్మకూరు మండల కేంద్రంలోని చిన్న కేశవ స్వామి ఆలయం, ఆలయం వెలుపల ఉన్న మెట్లబావి లను పురావస్తు శాఖ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

చెన్నకేశవ చెన్నకేశవ స్వామి ఆలయంలో లోపల నలువైపులా నిర్మాణాలను పరిశీలించిన అధికారులు, అపురూపమైన చారిత్రక ఆలయం అని తేల్చి చెప్పారు. ఆలయంలో కొలువై  ఉన్న చెన్నకేశవ స్వామి విగ్రహం క్రీస్తు శకం 16వ శతాబ్దం నాటిదని, మహామండపంలో ఇరువైపులా ఉన్న అల్వార్ విగ్రహాలు 18వ శతాబ్దం నాటివని తేల్చి చెప్పారు.. ఆలయంలో రాతి స్తంభాలతో  ఉన్న ముఖ మండపం కూడా 18 శతాబ్దం నాటిదని తెల్చి చెప్పారు.

  • 18 వ శతాబ్దం నిర్మించిన మెట్ల భావికి 13 శతాబ్దం నాటి కాకతీయ స్థంబాలు

మెట్ల బావికి  పూర్వ  వైభవం తేవడానికి , తిరిగి బావిని పునరుద్ధరించడానికి మంత్రి జగదీశ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే పూడికతీత పనులు శరవేగంగాకొనసాగుతున్నాయి.

పురావస్తు పరిశోధకుడు, ప్లీస్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివ నాగిరెడ్డి  తో పాటు

పురావస్తు శాఖ  అధికారి వెంకట్రామిరెడ్డి ఇతర అధికారుల పరిశీలనలో అబ్బురపరిచే వాస్తవాలు తెలిసాయి. 18వ శతాబ్దంలో నిర్మించిన మెట్ల బావి నిర్మాణంలో 13వ శతాబ్దంలో కాకతీయులు తయారుచేసిన రాతి స్తంభాలను వాడినట్లు   పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. స్తంభాలపై ఉన్న శృంగారపు శిల్పాలు చరిత్రను  ధృవీకరిస్తున్నాయని తెలిపారు. 

నిర్మాణం జరుపుకొని 300 సంవత్సరాలు  కావడం వల్ల శిధిలావస్థకు చేరిన మెట్ల వరుసలు వంకరులు తిరిగి , కొన్నిచోట్ల భూమిలోకి కుంగిపోయినట్లుగా పరిశీలనలో తేల్చారు. మెట్ల బావికి పక్కనే ఉన్న సత్రపు మండపం కూడా అక్కడక్కడ కుంగుబాటుకు గురైనట్లు గ్రహించారు. సత్రపు మండపం యొక్క ఆగ్నేయ భాగంలో ఉన్న ఒక అంకనం సిమెంటుతో నిర్మితమైనందున మిగతా అంకనాల మాదిరిగా రాతితో పునరుద్ధరించాలని మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశించారు.

  • వెలుగు చూసిన 1200 ఏళ్ల నాటి గణపతి విగ్రహం

పురావస్తు శాఖ అధికారులతో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి ఆత్మకూరు గ్రామంలో జరిపిన  అన్వేషణలో  అతి పురాతన కాలంనాటి గణపతి విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహాన్ని పరిశీలించిన నాగిరెడ్డి బృందం ఎనిమిదవ శతాబ్దం నాటి విగ్రహంగా తేల్చి చెప్పారు. 12 వందల సంవత్సరాల చరిత్ర ఈ విగ్రహానికి ఉందని మంత్రి కి వివరించారు. చారిత్రక  ఆధారాల ద్వారా ఆత్మకూరు గ్రామం యొక్క చరిత్ర ఇప్పటికీ 1200 సంవత్సరాల నాటిదని మంత్రి కి వివరించారు. అనంతరం పురావస్తు శాఖ అధికారులతో కలిసి  గ్రామంలో ఉన్న వారసత్వ కట్టడాలు, శకలాలను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి వాటిని పునరుద్ధరించడం ద్వారా చారిత్రక వైభవాన్ని గ్రామంలో తిరిగి నెలకొల్పుతానని అన్నారు. చారిత్రక గణపతి విగ్రహం రోడ్డు కంటే మూడు అడుగుల లోతులో ఉన్నందున, రోడ్డుపై మూడు అడుగుల ఎగువన పునరుద్ధరిస్తామని తెలిపారు. మెట్ల భావి పునరుద్ధరణ కార్యక్రమాలను వేగవంతం చేసి , ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. మంత్రి వెంట జిల్లా పరిషత్ వైస్ చైర్మన్  వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ స్వర్ణలత చంద్రారెడ్డి, కొనటం సత్యనారాయణ రెడ్డి, నరసింహారావు, బత్తుల ప్రసాద్, బ్రహ్మం గౌడ్, మల్లారెడ్డి, నంద్యాల వీరారెడ్డి తదితరులు ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

ktr

తెలంగాణ మీద అక్కసు – కేటీఆర్

ఈ 10 ఏండ్లలో రాహుల్ గాంధీ ఒక్కసారైనా మాట్లాడారా?