నిరుపేదలను తనకు స్థాయిలో అన్ని వర్గాలకు తన వంతు సాయం చేస్తున్న దుబాయ్ కరీముల్లా
నందిగామ గాంధీ సెంటర్ నందు సోమవారం ఉదయం వినాయకచవితి సందర్భంగా హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా గాంధీ సెంటర్లో పర్యవరణ పరిరక్షణ సమితి సహకారం తో మట్టి గణపతి ప్రతిమలను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి ఎలాంటి విఘ్నాలు తొలగించే వినాయకచవితి ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అలాగే పర్యావరణ పరిరక్షణ సమితి రామిరెడ్డి శ్రీధర్, ముస్లిం చైతన్య వేదిక దుబాయ్ కరీముల్లా కలిసి ఏర్పాటు చేసిన ఉచిత వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. పండుగలన్నీంటిని అందరూ కలిసి చేసుకోవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాకాలపాట్టి కృష్ణ, 6వ వార్డు కౌన్సిలర్ యాకూబ్ అలి(కట్టప్ప), సీనియర్ సిటిజన్ చిరుమామిళ్ళ చిన్ని ఇతర ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]