Galla Jayadev : చంద్రబాబు అక్రమ అరెస్టు, జైలు విషయాలను పార్లమెంటు లోపల, బయట కూడా లేవనెత్తడానికి సాధ్యమైన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి తాము ప్రయత్నిస్తామని గల్లా జయదేవ్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు వెలుపల ఉన్న గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు.. కింజరాపు రామ్మోహన్నాయుడు, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్ సహా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిని ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారన్నారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబును అరెస్టు చేసిందని, ఇది పూర్తిగా రాజకీయ కుట్రలో భాగమని గల్లా జయదేవ్ అన్నారు.
