ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి ఓ రైతు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆర్. జయంతి తెలిపిన వివరాల ప్రకారం.. జీకేఆర్.పురానికి చెందిన గొట్టాపు
జగన్మోహనరావు(47) బొబ్బిలిలోని పూల్బాగ్ కాలనీలో
భార్య రాధ, పిల్లలు సహన, నిర్మిషతో నివాసం ఉంటున్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వినాయక చవితి నేపథ్యంలో ఈనెల 16న స్వగ్రామానికి వచ్చారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆదివారం గ్రామ సరిహద్దుల్లోని తోటపల్లి కాలువ వద్దకు వెళ్లారు. ఎప్పటికీ రాకపోవడంతో బంధువులు వెళ్లి పరిశీలించగా.. కాలువలో విగతజీవిగా కనిపించాడు. పంచనామా నిమిత్తం బాడంగి సీహెచ్సీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు చనిపోయారని ఆయన భార్య ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు

[zombify_post]