విశాఖ-అరకు రహదారిలోని కొత్తవలస రైల్వే స్టేషన్ వద్ద ఈనెల 14న రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విశాఖపట్నం కేజీహెచ్ చికిత్స పొందుతున్న పట్టణానికి చెందిన వృద్ధురాలు కుంచం నర్సుమాంబ(64) ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఏఎస్సై పైడి రాజులు తెలిపారు. ఈమె భర్త విశ్వేశ్వరరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై కూడలి నుంచి ఇంటికి వెళుతుండగా వెనుక నుంచి ఆటో ఢీకొనడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈక్రమంలో కేజీహెచ్ చేరిన నర్సుమాంబ మృతి చెందడంతో ఏఎస్సై అక్కడికి వెళ్లి శవ పంచనామ నిర్వహించి పోస్టుమార్టం చేయించారు. ఈమె భర్త విశ్వేశ్వరరావు అక్కడే చికిత్స పొందుతున్నారని ఆయన చెప్పారు.
[zombify_post]