ఆదివారం సాయంత్రం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక – భారత్ జట్లు తలపడ్డాయి. టీమిండియా జట్టు కేవలం 6.1 ఓవర్లలో 51 పరుగుల టార్గెట్ను పూర్తిచేసి విజేతగా నిలిచింది. ఆసియా కప్ 2023 టైటిల్ దక్కించుకున్న భారత్ జట్టుకు భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ లభించింది. రోహిత్ సేన 1.25 కోట్లు (150000 డాలర్లు) ప్రైజ్ మనీగా అందుకుంది. స్ట్బౌలర్ సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో 4.16లక్షలు (5000 డాలర్లు) అందుకున్నాడు.