వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో నారా బ్రాహ్మణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్థలు, బహుళజాతి సంస్థలు, యువత ప్రజాస్వామ్యాన్ని జోక్ చేయటం వైసీపీ నేతలకు తగదని, ప్రతీ ఒక్కరూ చంద్రబాబు వెంటే ఉంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నారా బ్రాహ్మణి నిరసన గళం వినిపించారు. ఆదివారం రాజమండ్రిలో చేపట్టిన కాగడాల ప్రదర్శనలో భువనేశ్వరి, బ్రాహ్మణి పాల్గొన్నారు.