పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమల్నే పూజిద్దామని వైసీపీ పశ్చిమ ఇంచార్జి, విశాఖ డెయిర్ చైర్మన్, సూక్ష్మ చిన్న మధ్య తరహా ఎంటర్ ప్రైజస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఆధారి ఆనంద్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం ములగాడ హెూసింగ్ కాలనీ డబుల్ రోడ్డులోని అంజనేయ స్వామి సమీపంలో మట్టి ప్రతిమల్ని పంపిణీ చేశారు. అనంతరం నెహ్రూ నగర్ లేబర్ జంక్షన్ రోడ్ వద్ద ప్రతిమలతో పాటు సిద్ధి వినాయక వ్రత కల్పం పుస్తకాల్ని కూడా పంపిణీ చేశారు, సచివాలయ కన్నీసర్లు, గృహ సారథులు, వలంటీర్లు, వార్డులోని ప్రతి క్లస్టర్ లోనూ ఈ పండగను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ఆది దేవుని కృపకు పాత్రులు కండి.
ఈ సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే అదిదేవుడు. ప్రథమ పూజ్యడు అయిన మహా గణపతి . స్వామి వారిని ప్రతి ఒక్కరూ పూజించుకోవాలన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా భవిష్యత్తు తరాలకు కూడా ఆరోగ్య కరమైన వాతావరణంలోనే ఉండాలని, ఉచిత మట్టి గణపతి విగ్రహాల్ని, వ్రత పుస్తకాల్ని పంపిణీ చేసినట్టు తెలిపారు. అనంతరం మహా గణపతి మహిమల్ని గూర్చి తెలియజేశారు. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో వార్డు వైసీపీ అధ్యక్షులు రేవళ్ల సత్యనారాయణ, 58వ వార్డు అధ్యక్షుడు గులిగిందల కృష్ణ, సీనియర్ నాయకులు పెంటారావు, సచివాలయ కన్వీనర్లు రాజు, భూపతి, అమరావతి, కుంచారావు, సరోజ, ఖాన్, వై. సత్యనారాయణ, లక్ష్మి, కోరాడ శ్రీనివాసరావు, డేవిడ్, జిలానీ, మార్కెటింగ్ డైరెక్టర్ వి.రమణి, మడక రమణ, లోపింట్ రమణ, గృహ సారధులు, 59వ వార్డు వైసీపీ కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
[zombify_post]