- గురు న్యూస్ విశాఖపట్నం : పర్యావరణ పరిరక్షణలో ప్రజలు అందరూ భాగస్వాములు కావలని విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ శ్రీ కె.కె రాజు గారు అన్నారు. ఈమేరకు అక్కయపాలెం నర్సింహానగర్ రైతు బజార్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రంలో శ్రీ కె.కె రాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో బాగంగా స్థానిక ప్రజలకు మట్టి ప్రతిమలను అందజేశారు.పర్యావరణ పరిరక్షణలో బాగంగా ప్రజలు వినాయక చవితి వేడుకలు మట్టి ప్రతిమల తో జరుపుకోవాలని విజ్ఞప్తి చేసారు.ఏడాది తొలి పండుగ గా భావించే వినాయక మహొత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
[zombify_post]