*ఒకేషనల్ చదువుతున్న విద్యార్థులపై ప్రభుత్వం చిన్న చుపా…..*
*అప్రెంటిషిప్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి*
*హాస్పిటల్లో పనిచేస్తే నర్సింగ్ లకు కనీస వేతనం చెల్లించాలి*
*ఆన్ జాబ్ ట్రైనింగ్ కల్పించాలి పిడిఎస్ఓ డిమాండ్*
ఆదోని న్యూస్ :- ఆదోని పట్టణంలోని స్థానిక పద్మావతి కళాశాల నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేస్తూ అధికారి గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈకార్యక్రమం సందర్భంగా రాష్ట్ర నాయకులు తిరుమలేష్ మాట్లాడుతూ……. ప్రైవేట్ ,కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే నర్సింగులకు , ల్యాబ్ టెక్నీషియన్ కు కనీసం వేతనం ఇవ్వాలి. అలాగే శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వం స్టేఫండ్ ఇవ్వాలి అలాగే రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలని లక్ష్యంతో అప్రెంటిసి విధానాన్ని ఆంధ్రప్రదేశ్ నైపుణ్యా అభివృద్ధి సంస్థ ప్రారంభించింది ఏదైనా పరిశ్రమ లేదా హాస్పిటల్లో గాని అప్రెంటిషిప్ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తే విద్యార్థులకు ఇచ్చిన స్టేట్ ఫండ్ ప్రభుత్వమే చెల్లించాలి కాకపోతే స్టేఫండ్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసి వృత్తి విద్యార్థులకు కడుపు కొడుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అప్రెంటిషిప్ స్కీమ్ ఇన్ ఏపీ ఇన్ పూర్తిస్థాయిలో అమలు చేయాలి విద్యార్థులకు వృత్తిదార కోర్సులు కాబట్టి కోర్సులు అయిపోయిన తర్వాత విద్యార్థులకు ప్రభుత్వమే వాళ్లకు ఉపాధి వృత్తిని చూపించాలి అలా కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ లో, కార్పొరేట్ హాస్పిటల్లో 3000 నుండి 5000 వరకు ఇచ్చే జీతాల కన్నా వాళ్లకు గ్రామాల నుంచి వచ్చే అనేక రకాలుగా రవాణా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కావున ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క విద్యార్థుల సమస్యల పై స్పందించి వాళ్లకు న్యాయం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ కోరడమైనది ఈ కార్యక్రమంలో ఆదోని పట్టణ అధ్యక్షుడు శివ మహిళా సెల్ కన్వీనర్ నికిత, కృష్ణవేణి, కళాశాల కమిటీ అధ్యక్ష ,కార్యదర్శులు రవీంద్ర,సాయి, వంశీకృష్ణ శ్రావణి ,మాధవ్ ,ప్రవీణ్ విద్యార్థులు పాల్గొన్నారు.
[zombify_post]