సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ పేరు చెప్పి పర్ణశాలలో గణేష్ నిమజ్జనన్ని అడ్డుకోవడం సరికాదని పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి పేర్కొన్నారు.పర్ణశాల ఘాట్ వద్ద సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు 10% కూడా జరగలేదు,అటువంటిది పర్ణశాలలో తరతరాల నుంచి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుందని అనేక ప్రాంతాల నుండి గణనాధుని పర్ణశాల గోదావరి ఘాట్ నందు నిమజ్జనం చేసి శ్రీ సీతారామచంద్ర స్వామిని భక్తులు దర్శించుకుని, భక్తుల యొక్క శోకాన్ని విడిచి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో ముందు కదిలేవారని అటువంటి చరిత్ర కలిగిన ప్రాంతంలో పర్ణశాల ఘాట్ నందు 10 శాతం కూడా పూర్తికాని సీతమ్మసాగర్ ప్రాజెక్ట్ నిమిత్తం, గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని పర్ణశాలలో నిషేధించడం సరికాదనిఅన్నారు..అంతేకాకుండా భద్రాచలం వెళ్లి గణేష్ నిమజ్జనాన్ని చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని, వ్యవసాయ పనులు నడుస్తున్న సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ, దేవునిపై భక్తితో వినాయక చవితి వేడుకలను నిర్వహిస్తున్న భక్తులకు గణేష్ నిమర్జనం వేడుకలు భారం కాకూడదని అధికారులు సహృదయంతో స్పందించి పర్ణశాలలో గణేష్ నిమర్జనంకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు….
[zombify_post]