డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఐ.పోలవరం మండలం పశువుళ్లంక మొండి గ్రామంలో రామాలయం నందు ఐ.సి.డి.యెస్. అద్వర్యం లో బాల్యవివాహాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రంలో గ్రామ స్థాయిలో నమోదవుతున్న 18 సంవత్సరాల లోపు వయస్సు గర్భవుతులను గుర్తించి, దాని వలన జరిగే అనర్ధాలను విస్తరణాధికారి సి.హెచ్ నాగలక్ష్మి గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు తెలియజేశారు.బాల్యవివాహాల వలన జరిగే నష్టాలను మరియు చట్టరీత్యా తీసుకొనే చర్యలను ఐ.సి.పి.యెస్. సిబ్బంసి శ్రీనివాస్ తెలియజేసారు, 18 సం.లలోపు బాలికలు,21 సం. లలోపు అబ్బాయిలు ఉన్నత చదువులు చదువుకొని ప్రయోజకులు కావాలని మండల విద్యా శాఖ అధికారులు తెలియజేసారు, ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు,పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఆరోగ్య కార్యకర్తలు,అంగన్వాడీ సిబ్బంది,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
[zombify_post]