రహదారికి మరమ్మతులు
హిరమండలం మేజరు పంచాయతీ నౌగుడ గ్రామం వద్ద అధికారులు గురువారం ఏబీ రహదారి మరమ్మతులు చేపట్టారు
హిరమండలం మేజరు పంచాయతీ నౌగుడ గ్రామం వద్ద అధికారులు గురువారం ఏబీ రహదారి మరమ్మతులు చేపట్టారు. రహదారి అధ్వాన పరిస్థితిపై ఈ నెల 13న 'ఈ నరకం.. ఇంకెంత కాలం..?'. దీనిపై స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి స్పందించారు. రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్లతో మాట్లాడారు. అధ్వానంగా ఉన్న రహదారిని పరిశీలించి వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేయించారు. రోడ్డు సమతలం చేసి వెట్ మిక్స్డ్ గుమ్మిలు పూడ్చివేయించారు. ఏఈ కిరణ్ మాట్లాడుతూ నౌగుడ వద్ద రహదారి ప్రదేశంపై కోర్టులో వ్యాజ్యాలు ఉండటంతో పూర్తి స్థాయిలో రోడ్డు వేయలేకపోయామని, కోర్టు వివాదం | పరిష్కారమైతే శాశ్వతంగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.
[zombify_post]