కొవ్వూరు తూర్పు గోదావరి జిల్లా:రేపు (శనివారం) జరిగే ముఖ్యమంత్రి నిడదవోలు పర్యటనను విజయవంతం చేసేలా కొవ్వూరు నియోజకవర్గం స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలకు హోంమంత్రి తానేటి వనిత దిశా నిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యం లో శుక్రవారం హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీలు, జడ్పీటీసీలు, నామినేటెడ్ పదవులు పొందిన వారు, నాయకులతో హోంమంత్రి తానేటి వనిత సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారిగా సమీక్ష నిర్వహిస్తూ నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి నిడదవోలు పర్యటనను విజయవంతం చేయడానికి అందరూ సమిష్టి కృషితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటన, రవణా, ఆహారం తదితర అంశాలపై నాయకుల నుండి సూచనలు, అభిప్రాయాలను సేకరించారు. నిడదవోలులో ముఖ్యమంత్రి చేతుత మీదుగా 'వైఎస్సార్ కాపు నేస్తం' కార్యక్రమంలో లబ్ధిదారులకు నిధులను విడుదల చేస్తారని తెలిపారు. స్వచ్ఛందంగా వచ్చే జనాలను సభా ప్రాంగణానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని గ్రామాల వారీగా నాయకులు బాధ్యతలు కేటాయించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. నిడదవోలు నియోజకవర్గానికి కొవ్వూరు చాలా దగ్గర కనుక నాయకులు అందరూ ఎక్కువ బాధ్యత తీసుకుని సభను విజయవంతం చేయాలన్నారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా పేదల కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారని చెప్పడానికి రాష్ట్రంలో అమలవుతున్న పథకాలే నిదర్శనమన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం రూపొందించారని తెలిపారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా విద్యారంగంలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకునని ఓట్లు లేని చిన్నారులకు సైతం మంచి భవిష్యత్ అందించాలనే మనసున్న సీఎం జగన్ అని తెలిపారు. చంద్రబాబు నాయుడు అరెస్టు, రిమాండ్ జైలు అంతా చట్ట ప్రకారం న్యాయం ప్రకారమే జరిగిందన్నారు. ప్రస్తుతం రాజకీయంగా ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రతిపక్షాలు అన్నీ ఏకమై కుయుక్తులు పన్నుతున్నాయని… వాటిని నాయకులు అంతా కలిసికట్టుగా తిప్పికొట్టాలని హోంమంత్రి తానేటి వనిత పిలుపునిచ్చారు.
[zombify_post]