వినాయక చవితి పందిళ్ళు మండపాలు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరిగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి నుంచి తీసుకోవాలని పాడేరు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధీరజ్ వెల్లడించారు. స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉత్సవాలు నిర్వహించే వారు తప్పనిసరిగా నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. వినాయక ఉత్సవాల మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్ లలో తెలిపి, గుర్తింపు కార్డు నకలు కాపీలు సమర్పించి అనుమతి పొందాలన్నారు. ప్రైవేట్ లేదా పంచాయతీ సంబంధించిన స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన వారు ముందుగా సదరు ప్రైవేటు స్థలమైతే స్థల యజమాని, ప్రభుత్వ స్థలమైతే పంచాయతీ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వినాయక పందిళ్ళు, విగ్రహం పెట్టి ప్రదేశం వాహన రాకపోకలకు అంతరాయం కలుగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతిష్టించనున్న వినాయక విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం, నిమజ్జన ప్రదేశము మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఉత్సవాల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఉత్సవ కార్యనిర్వాహకులో పూర్తి బాధ్యత వహించవలసి ఉంటుందని. వినాయక విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులు తగిన భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో పాడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు.
[zombify_post]