విజయవాడ కూర్మయ్య వంతెన వద్ద రైవస్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. కాలువలోని చెత్తలో మృతదేహం ఇరుక్కుపోయి దుర్వాసన వస్తున్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందచేశారు. సూర్యారావుపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
[zombify_post]